రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశం

ఈ విషయం చంద్రబాబు నాయుడుకి తెలిసే రాద్ధాంతం చేశారు

avanthi srinivas
avanthi srinivas

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి తెలిసే రాద్ధాంతం చేశారని మంత్రి అవంతి శ్రినివాస్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం కూడా స్పష్టం చేసిందని అన్నారు. ఈ విషయంలో రాజధాని రైతులను చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని విమర్శించారు. బుద్దున్నవారెవరైనా విశాఖలో రాజధానికి వస్తారా అన్నా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బుద్ధిలేకనే గతంలో విశాఖలో సమ్మిట్‌లు పెట్టారని ఎద్దేవా చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేదల ఇళ్ల కోసమేనని, ఇందులో అవినీతికి ఆస్కారం లేదన్నారు. ల్యాండ్‌పూలింగ్‌కు చంద్రబాబు నాయుడు అనుకూలమా?..వ్యతిరేకమా? చెప్పాలని అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/