తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం

Tirumala Venkanna swamy

Amaravati: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 61,045 మంది భక్తులు దర్శించుకోగా, 20,884 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/