విమర్శలకు గురైన బిజెపి ఎంపి

Nishikant Dubey
Nishikant Dubey

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డ పార్లమెంట్‌ సభ్యుడు నిషికాంత్‌ దుబే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా మాట్లాడిన ఆయన.. జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ నిర్ణయం మీద నమ్మకం ఉంచాలన్నారు. అధిష్టానం ఎవ్వరిని అభ్యర్ధిగా ప్రకటించినా వారికే ఓటేయాలని కార్యకర్తలకు నిర్దేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దొంగలైనా, బందిపోట్లైనా, నేరస్థులైనా వారినే గెలిపించాలని వ్యాఖ్యానించారు. కాగా ప్రతిపక్ష నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వీటిని మాత్రమే ప్రస్తావించిన ఎంపీ మీద మండిపడ్డారు. ఎన్నికల్లో అధిష్టానం మంచి వారనే ఎన్నుకుంటుందని, తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana