సృజనాత్మక ప్రక్రియ

జీవన శైలి

Talking
Talking

ముఖ్యాంశాలు

  • మాట్లాడటం ఒక కళ..అందరికీ సాధ్యం కాదు
  • అందిరనీ అలర్ట్‌చేయాలంటే కొన్ని టిప్స్‌ ముఖ్యం
  • సంభాషణ ఎపుడూ ఆహ్లాదకరగా ఉండాలి
  • ప్రతిమాటలోనూ ఆత్మవిశ్వాసం తొంగిచూడాలి

మాట్లాడటం కూడా ఒక కళ. అయితే అది అందరికీ సాధ్యం కాదు. కొంత మంది ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడూ ముగిస్తారా అన్నట్లుగా ఉంటుంది.

అందుకే ఏదో ఒకటి మాట్లా డామా అన్నట్లుగా కాకుండా అందరిని అలర్ట్‌ చేయాలంటే కొన్ని టిప్స్‌ పాటించడం ముఖ్యం.

ఎంత సేపు మాట్లాడామన్నది ముఖ్యం కాదు. ఏం మాట్లాడామన్నది ముఖ్యం . సంభాషణ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండాలి. మధ్య మధ్యలో కాస్త సరదాగా మాట్లాడితే వినేవారికి హాయిగా ఉంటుంది.

ఒక విషయం మీద వాదన చేస్తున్నప్పుడు ఏదోలే అన్నట్లు కాకుండా ప్రతి మాటలోను ఆత్మవిశ్వాసం తొంగి చూడాలి. చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పకూడదు.

మాట్లాడటం అంటే సృజనాత్మక ప్రక్రియ సంభాషణ ఎలా మొదలుపెట్టాలి. ఎలా ముగించాలనే విషయం మీద అవగాహన ఉండాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/