కాంగ్రెస్, బిజెపికి అభ్యర్థులే లేరు?
అభ్యర్థులు లేని పార్టీలు మాకు పోటీనా?

కరీంనగర్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపికి అభ్యర్థులే లేరని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అభ్యర్థులు లేని పార్టీలు తమకు పోటీనా? అని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసిందేమీలేదని విమర్శించారు. జగిత్యాలలో ముఖ్యమంత్రి కుమార్తే కవిత చేసిన అభివృద్దే కనబడుతోందన్నారు. బిజెపి ఎంపీగా గెలిచిన దర్మపురి అరవింద్ ఎక్కడికి పోయారని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని కొప్పుల జోస్యం చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/