క్యూబాపై ప్రచ్ఛన్న యుద్ధం

Cuba
Cuba

హవానా: క్యూబాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ఇంటర్నెట్‌ వేదికగా అమెరికా కుట్ర అమలుకు ప్రయత్నిస్తోంది. క్యూబా విప్లవ ప్రభుత్వం ఇంటర్నెట్‌కు బద్ధ శత్రువన్న అపోహ విస్తృత స్థాయిలో వ్యాపించిన విషయం తెలిసిందే. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా క్యూబా ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఈ అబద్ధ ప్రచారానికి దారి తీస్తోంది. క్యూబా వ్యతిరేక కుట్రల అమలుకు అమెరికా టెలికమ్యూనికేషన్‌ రంగాన్ని, ముఖ్యంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకుంటోంది. వాస్తవానికి ఈ అత్యాధునిక టెక్నాలజీలేవీ క్యూబన్లకు అందుబాటులోకి రాకుండా వాల్‌స్ట్రీట్‌ అడ్డుపడుతోందన్నది బహిరంగ రహస్యమే.. క్యూబాలో ప్రజలు రోజూ పోస్ట్‌ చేసే ట్వీట్‌లు, ఆన్‌లైన్‌ ప్రజంటేషన్‌లు, ఫేస్‌బుక్‌ పోస్ట్‌ల వంటి వాటితో ఇంటర్నెట్‌లో అపరిమితమైన సమాచారం చేరుతోంది. దీనికితోడు ప్రస్తుతం ఇంటర్నెట్‌ వేదికగా విశ్లేషకులు ప్రజల రాజకీయ ప్రాధాన్యతలను, శృంగార జీవితాలను నిర్దేశిస్తున్నారు. ఇవన్నీ సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు అనునిత్యం అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికా కేంద్ర గూఢచార సంస్థ (సిఐఎ)లో భాగంగా వున్న రాజకీయ కార్యాచరణ బృందాని(జిఎపి)కి చెందిన ప్రత్యేక కార్యకలాపాల కేంద్రం, దేశంలో యువతను, ఆయా ప్రాంతాల వారిని రెచ్చగొట్టే విధంగా ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను సృష్టించే ప్రాజెక్టులను చేపడుతోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/