నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం రెడీ

రేపు రాష్ట్రపతి రాక

The coast of Visakha is ready for naval maneuvers
The coast of Visakha is ready for naval maneuvers

Visakhapatnam: నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం రెడీ అయింది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాలను బలోపేతం చేసే ప్రధాన ఘట్టాలకు విశాఖ తూర్పు నౌకాదళం వేదిక కానుంది. . ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌), వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్‌ – 2022 కు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక విన్యాసాల కోసం నౌకాదళం చేస్తున్న రిహార్సల్స్‌తో విశాఖ సాగర తీరంలో సందడి వాతావరణం నెలకొంది. కాగా,
ఈ నెల 21న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ యుద్ధ నౌకలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్‌.కె.బీచ్‌కు సమీపంలోని సాగర తీరాన ఈ కార్యక్రమం జరుగనుంది. ఇదిలా ఉండగా సముద్రంలో జరుగుతున్న నేపథ్యంలో రహదారులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని సీపీ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా స్పష్టం చేశారు.
స్వస్థ (ఆరోగ్యం – సంరక్షణ) వ్యాసాల కోసం: