యమపురికి దగ్గరి దారులు మన రహదారులు

యమపురికి దగ్గరి దారులు మన రహదారులు
Damaged Roads

భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ చాలా ప్రాచీన కాలం నుండి మనుగడలో ఉంది. నాగరికతకు పుట్టినిల్లయిన భారత్‌ పురాతన కాలం నుండి ఎన్నో రకాల పరిశోధనలకు అంకురా ర్పణ గావించింది. గణిత, ఖగోళ, వైద్య శాస్త్రరంగాల్లో ప్రాచీన కాలం నుండే భారతదేశానికున్న విశిష్టత ప్రపంచానికి విదితమే. మన పెద్దలు, ఆనాటి పాల కులు ఎన్నో రకాలుగా ప్రజలకు తమ విధానాల ద్వారా చేరవయ్యారు. చెట్ల పెంపకం, నీటి వనరులు వినియోగం, డ్రైనేజీ వ్యవస్థ వంటి విషయాలలో ప్రాచీన కాలపు పాలకులు చూపిన శ్రద్ధాశక్తులు ప్రశంసనార్హం. ప్రాచీన పాలకులు పాటిం చిన ఇంజినీరింగ్‌ విధానాలలోని నైపుణ్యం ఈనాటికీ ఒక అద్భుతమైన ఘట్టమే అని చెప్పక తప్పదు.సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనకు ప్రతీ విషయం అద్భుతంగానే కనిపిస్తుంది.ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టు కుని భారతదేశంలో రోడ్డు రవాణావ్యవస్థకు ప్రాచీనకాలంలోనే అంకురార్పణ జరిగిన విషయం మనలో చాలా మందికి తెలి యకపోవచ్చు.చంద్రగుప్తుడు,అశోకుని కాలంలోనే భారతదేశం లో రహదారుల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం భారతదేశం రహదారుల నిర్మాణ వ్యవస్థలో రెండవస్థానంలో ఉంది. అమెరికా ఈ విషయంలో ప్రథమ స్థానంలోనూ, ఇండియా, చైనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండియన్‌ రోడ్‌ ఇండస్ట్రీస్‌ నివేదిక ప్రకారం మనదేశం 5.5 మిలియన్‌ కిలోమీటర్ల రోడ్‌ నెట్‌వర్క్‌ కలిగిఉంది. భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్‌ అధిక రోడ్‌ నెట్‌వర్క్‌ కల రాష్ట్రం. మనదేశంలో 60శాతంపైగా సరుకు రవాణా రోడ్డుమార్గం ద్వారా జరుగు తున్నది. ఇప్పటికీ 90 శాతం ప్రజలకు రహదారి ప్రయాణమే శరణ్యం. మనం మన రహదారులను జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, రాష్ట్ర, జిల్లా రహదారులు, గ్రామీణ రహ దారులుగా వర్గీకరణ చేయవచ్చు. జాతీయ రహదారులు దేశం లోని వివిధ ప్రాంతాలను కలుపుతున్నాయి. నాలుగు, ఆరు, ఎనిమిది వరుసల రహదారులు పెరుగుతున్న ప్రజల అవస రాల దృష్ట్యా నిర్మించబడుతున్నాయి. జాతీయ రహదారులు ‘నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్మించబడుతున్నాయి. భారతీయ రహదారుల వ్యవస్థలో ట్రాఫిక్‌ విషయంలో40శాతం జాతీయ రహదారులే ఆక్రమి స్తున్నాయి.ఎన్ని రహదారులు నిర్మించినా భారతదేశ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. రోడ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా మారింది.అన్ని రకాల రహదారుల నాణ్యతా లోపం వలన స్వల్పకాలానికే పాడైపోతున్నాయి.అధిక ట్రాఫిక్‌తో, భారీ వాహనాలతో వర్షాల వలన మన రోడ్లన్నీ గుంతలతో నిండిపో తున్నాయి.వర్షం కురిస్తే రహదారులు తటాకాలను తలపిస్తు న్నాయి. మిగతాకాలం దుమ్ముధూళిని వెదజల్లే కాలుష్య కారకా లుగా రహదారులు రూపాంతరం చెందాయి. కాంక్రీటు, తారు తో రహదారులను ఎక్కువగా నిర్మిస్తున్నాం. ఇండోనేషియా, యుఎస్‌.యు.కెలలో ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణం జరిగింది. కేరళలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లను నిర్మించే కార్యక్రమం జరుగుతున్నది. మనదేశంలో చాలా చోట్ల ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది. లక్షల టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రజలాల్లో కలిసిపోవడం, పర్యావర ణానికి హానిగా మారడం కంటే ఇలాంటి హానికారక ప్లాస్టిక్‌ను రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవ్ఞతున్నమాట వాస్తవం. అయితే ప్లాస్టిక్‌ రహ దారుల నిర్మాణం వలన కూడా చాలా అనర్థాలు జరుగుతా యని, అధిక ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్‌ కరిగిపోయి మరింత హానికారకంగా మారుతుందని, ప్లాస్టిక్‌ను కరిగించడం వలన పర్యావరణం దెబ్బతింటుందనే వాదన బలంగా ఉంది.

రహదారులు ఎలా నిర్మించాలనేది ప్రజలకు అనవసరం. రహ దారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుం తలులేని రహదారులు కావాలని ప్రజల ఆకాంక్ష. నాణ్యతా లోపాల వలనే రహదారులు త్వరగా పాడైపోవడం, గుంతలతో అనేకమంది అమాయక ప్రాణాలు బలికావడం నిత్యం రహదా రులన్నీ రక్తసిక్తం కావడం చూస్తున్నాం. కొంతమంది స్వార్థప రులకు రహదారుల నిర్మాణం కాసుల కురిపించే యజ్ఞంలా మారింది. నిర్మించిన కొద్ది రోజులకే రహదారులన్నీ గుంతలతో బీభత్సంగా మారి, వాహనాలు బోల్తాపడడం, అమాయకుల పంచప్రాణాలు అనంతవాయువ్ఞల్లో కలిసిపోతున్నాయి. రహ దారులన్నీ మృత్యుకుహరాల్లా మారిపోతున్నాయి.

స్వర్గానికి ప్రత్యక్ష దారులుగా రహదారులు తయారైనాయి. అవినీతిపరు లకు రహదారుల నిర్మాణం అక్షయపాత్రలా కోరినప్పుడల్లా కొంగు బంగారంలా లాభదాయకంగా మారిపోయాయి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం వలన, వాహనదారుల మితి మీరిన వేగంవలన తాగి, వాహనాలను నడపడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 1.25 మిలియన్ల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటే ఒక్క మనదేశంలోనే ఇరవై వేల మందికిపైగా పాదచారులు ఇతరుల పొరపాట్ల వలన బలైపోతున్నారు.

రహదారులపై పడే గుంతల వలన9వేల మందికిపైగా మృత్యు వాతపడుతున్నారు.ఇరవై వేలమందికిపైగా తీవ్ర గాయాలవ్ఞతు న్నాయి. మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవించే హక్కు ప్రతిఒక్కరికిఉంది. ఇతరుల పొరపాట్ల వల్లనో, నిర్లక్ష్యం వల్లనో నాణ్యతాప్రమాణాలు లేని రోడ్లనిర్మాణం వల్లనో ప్రజలజీవించే హక్కును హరించడం దుర్మార్గం. వాహనదారుల తప్పులకు భారీ జరిమానాలను విధించే ప్రభుత్వ చట్టాలు నాణ్యత లేని రహదారులను నిర్మించే సంబంధిత వ్యవస్థలలోని అవినీతి పరులను, గుంతల వలన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులను కల్పిస్తున్న స్వార్థపరులపై దృష్టి కేంద్రీకరించాలి. రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్లను సక్రమంగా నిర్వహించాలి. చాలా చోట్ల స్పీడ్‌ బ్రేకర్లే ప్రమాద హేతువ్ఞలుగా మారుతున్నాయి. వేగనిరోధకాల వద్ద తప్పనిసరిగా అందరికీ కనిపించే విధంగారంగులను పూయాలి. రిఫ్లెక్టర్లను తప్పనిసరిగా వేగనిరోధకాల వద్ద అమర్చాలి.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/