రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి

ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు

kala venkatrao
kala venkatrao

అమరావతి: లాక్‌డౌన్‌ విధించినప్పటికి రాష్ట్రంలో సారా ఏరులై పారుతోందన్న స్పికర్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఏపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు. దీనికి ఎక్సైజ్‌ శాఖ మంత్రి నైతిక భాధ్యత వహిస్తు తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమయిన నిత్యవసరాలు దోరకడం కష్టంగా ఉంటే మద్యం మాత్రం వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తున్నారన్నారు. దేశంలొని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా పై ప్రజలకు భరోసానిస్తుంటే జగన్‌ మాత్రం తాడేపల్లికే పరిమితమయ్యారన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికి రాష్ట్రంలో క్వారంటైన్‌ కేంద్రాలలో కూడా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించేలా ఉన్నారని విమర్శించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది ఉఫాదికోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాబట్టి ఈ సమయంలో పంతాలు పట్టింపులకు పోకుండా అన్న క్యాంటిన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/