పెట్రోల్‌, డీజిల్‌ పై కేంద్ర ప్రభుత్వం బాదుడు

పెట్రోల్‌ పై రూ. 18, డీజిల్‌ పై రూ.12 వరకు..
ఎలాంటి చర్చ లేకుండా చట్ట సవరణ

petrol bunk
petrol bunk

దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో దేశ ఖజానా కు గండి పడుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ లోటును పూడ్చుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా ప్రత్యేక పరిస్థితులలో లీటరు
పెట్రోల్‌పై రూ. 18 వరకూ, అలాగె డీజిల్‌పై రూ.12 వరకూ ఎక్సైజ్‌ సుంకాలను పెంచుకునేలా చట్ట సవరణ చేసింది. ఈ సవరణను లోక్‌సభలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టగా, ఎటువంటి చర్చలేకుండానే లోక్‌సభ ఆమోదం పొందినట్టు స్పీకర్‌ ప్రకటించారు. అయితే గతంలో పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌ పై రూ. 4 వరకూ వరకూ మాత్రమే ఎక్సైజ్‌ సుంకం పెంచుకునే వెసులుబాటు ఉండేది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/