కేంద్రం డైరెక్షన్‌ రాష్ట్రం ప్రభుత్వం పాటించాలి

`రాజధాని విషయంలో కేంద్రానికి సూచనలు చేసే అధికారం ఉంటుంది

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతి: రాజధాని విషయంలో కేంద్రం డైరెక్షన్‌ రాష్ట్రా ప్రభుత్వం పాటించాల్సి ఉంటుందని టిడిపి సినీయర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాజధాని విషయంలో సూచనలు చేసే అధికారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానికే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వ్యవహారం విభజన చట్టంలో ఉందని యనమల అన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ విభజన చట్టం ప్రకారం ఏర్పాటు అయ్యిందనీ గుర్తు చేశారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ ఇల్లు కూడా ఇన్సైడర్‌ ట్రేడింగ్‌ అవుతుందా అని యనమల ప్రశ్నించారు. 2018లో మా అల్లుడు భూములు కొంటె కూడా ఆరోపణలా అని యనమల నిలదీశారు. రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇవ్వక ముందే సీఎం జగన్‌ ఎలా ప్రకటన చేస్తారని విమర్శించారు. రాజధానిపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చెల్లదన్నారు. జీఎన్‌ రావు కమిటీకి ఉండే అవగాహన ఏంటని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/