ఢిల్లీ కాలుష్య నివారణకు కేంద్రం సహకరించాలి

రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌

ashok gehlot
ashok gehlot

జైపూర్‌: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యంతో పక్క రాష్ట్రాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కేంద్రం సహకరిస్తేనే ఢిల్లీలు వాయుకాలుష్యం తగ్గించడం సాధ్యమని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అభిప్రాయపడ్డారు. కేవలం ఢిల్లీ ప్రభుత్వమే వాయు కాలుష్యాన్ని తగ్గించలేదని పేర్కొన్నారు. అయితే పెరిగిన వాయు కాలుష్యంతో ఢిల్లీతో సహా పక్క రాష్ట్రమైన రాజస్థాన్‌ కూడా ఆందోళన చెందుతోంది. వాయు కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల ఉన్న హెల్త్‌ ఎమర్జెన్సీ అని, కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నియంత్రించలేదని, కేంద్రం కూడా చొరవ తీసుకోవాలని గెహ్లాట్‌ విజ్ఞప్తి చేశారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/