సామాన్యులకు మరో షాక్ ఇచ్చిన కేంద్రం

సామాన్యులకు కేంద్రం వరుస షాకులు ఇస్తూనే ఉంది. ఇప్పటీకే పెట్రోల్ , డీజిల్ ధరలు , నిత్యావసర ధరలు , గ్యాస్ ధరలు ఇలా ప్రతిదానిపై ధరలు పెంచిన కేంద్రం..ఇప్పుడు మందులపై భారం మోపింది. దాదాపు అన్ని మందులపై 60% వరకు పెంచింది. కరోనా సంక్షోభంలో మందులకు డిమాండ్‌ పెరిగిందని, ఉచిత వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం వడ్డించింది.

ఇక పెరగనున్న మందులు ఇవే..

  • జ్వరం మందులు (పారాసిటమాల్‌ వంటివి)
  • యాంటి బయోటిక్స్‌ (అజిత్రోమైసిన్‌ వంటివి)
    *అంటువ్యాధులు
  • గుండె సంబంధిత వ్యాధులు
  • రక్తపోటు (బీపీ)
  • డయాబెటిస్‌ (షుగర్‌)
  • చర్మవ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు
  • రక్తహీనత (ఫోలిక్‌ యాసిడ్‌ వంటి ఔషధాలు)
  • రక్తప్రసరణ సంబంధిత జబ్బులు
  • క్షయ (టీబీ)
  • వివిధ రకాల క్యాన్సర్లు
  • మినరల్‌, విటమిన్‌ తదితర గోళీలు
    మరో 800 రకాల అత్యవసర ఔషధాలు, మెడికల్‌ డివైజ్‌లు