ఇంగ్లీష్‌ మీడియంతో అద్భుత కెరీర్‌

బోధన కోర్సులు

ఇంగ్లీష్‌ మీడియంతో అద్భుత కెరీర్‌
English medium Students (File)

పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం బోధన అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయ విద్యలోనూ ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్లూ, ఇగ్నో, హెచ్‌సియూ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో పిజీ, పీజీ డిప్లొమా స్థాయిలో ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఇంగ్లిష్‌ మీడియంలో బోధించే మెళకువలను ఈ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇన్‌స్టిట్యూట్‌లు ఆయా కోర్సుల కరిక్కులంను రూపొందిస్తున్నాయి.

ఇద్దరు తెలుగువారు కలుసుకున్నా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుంటారు. వారిద్దరికి మాతృభాష వచ్చినా ఇంగ్లిష్‌లో మాట్లాడుకున్నంత సులభంగా తెలుగులో మాట్లాడలేకపోవడం లేదా స్మోకన్‌ ఇంగ్లిష్‌పై మోజు కావచ్చు. అంతేకాదు నేటికాలంలో ఇంగ్లిష్‌ ప్రాధాన్యత పెరిగింది. గ్లోబలైజేషన్‌ యుగంలో ఉన్న మనం ఇంగ్లిష్‌వైపు యువత ఆసక్తి చూపుతున్నది. ఇది తప్పనిసరైన అవరంగా మారడం ఒక కారణం కూడా కావచ్చు. ఎందు కంటే సివిల్స్‌ నుండి గ్రూప్స్‌ వరకూ ఏ సర్కారీ కొలువు కావాలన్నా ఐటి నుంచి బ్యాంకింగ్‌ వరకూ ఏ రంగంలో ఉద్యోగం రావాలన్నా ఇంగ్లిష్‌ నైపుణ్యాలు తప్పనిసరిగా మారాయి. ఉన్నత విద్యకు వెళ్లాలన్నా, విదేశాల్లో విద్యా, ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలన్నా ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకపోవడం పెద్ద ఆటంకంగా మారుతోంది. ఫలితంగా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలన్నీ ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్న వారికే వరిస్తున్నాయి.

ఒక స్థాయి దాటాక ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్‌ ఒంట బట్టకపోవడం చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్‌ చదువులు చదివిన వారితో పోటీ పడలేక కుంగిపోవడం ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్‌ ఆవశ్యకత పెరుగుతున్నది.

కంప్యూటర్‌, సైన్స్‌, మ్యాథ్స్‌ భాష ఇంగ్లిష్‌. ఇంజనీరింగ్‌, మెడికల్‌లో రాణించాలంటే ఇంగ్లిష్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో దూసుకుపోవాలన్నా ఇంగ్లిష్‌. ఐటి రంగంలో కొలువుకొట్టాలంటే ఇంగ్లిష్‌. సివిల్స్‌లో రాణించాలంటే ఇంగ్లిష్‌. విదేశీ విద్యకు వెళ్లాలంటే ఇంగ్లిష్‌! పరిశోధనల్లో సత్తా చూపాలంటే ఇంగ్లిష్‌ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టు రావాలన్నా ఇంగ్లిష్‌!

  • వినీత్‌ ఇంటర్‌ వరకూ తెలుగు మీడియం. ఆ తర్వాత బిటెక్‌ (సిఎస్‌ఈ) పూర్తి చేశాడు. అకడమిక్‌గా టాప్‌ గ్రేడ్‌. ఉద్యోగ సాధనలో భాగంగా ఓ ప్రముఖ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. గ్రూప్‌ డిస్కషన్‌ (జిడి), పర్సనల్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాలని పిలుపు వచ్చింది. ఎంతో ఆనందంగా వెళ్లాడు. కానీ అక్కడ అంతా ఇంగ్లిష్‌లోనే! గ్రూప్‌ డిస్కషన్‌లో, ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను స్పష్టంగా, అనర్గళంగా చెప్పలేక అవకాశం కోల్పోయాడు.
  • సంపత్‌ పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాడు. భవిష్యత్తులో ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో ఓ ప్రముఖ విద్యాసంస్థలో ఇంటర్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో చేరాడు.కానీ అక్కడ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఇలా ముఖ్య సబ్జెక్టుల బోధన పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో జరిగేది. లెక్చరర్‌లు చెప్పేది అర్ధం కాక పదో తరగతి వరకు టాప్‌ స్టూడెంట్‌గా ఉన్న సూరజ్‌ ఇంటర్‌లో యావరేజ్‌ స్టూడెంట్‌గా మారాడు. కారణం పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫౌండేషన్‌ సరిగా లేకపోవడమే.
    ఇంగ్లిష్‌ రాకపోతే అడుగడుగునా ఆటంకాలే. ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌..ఇలా ఏ కోర్సులో ప్రవేశం పొందాలన్నాచేరిన కోర్సులో రాణించాలన్నా ఇంగ్లిష్‌ రాకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఎంతోకష్టపడి చదివి ఎంట్రెన్స్‌ టెస్టులో ర్యాంకు సాధించి..టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాక..ఇంగ్లిష్‌లో ఉన్న సబ్జెక్టులను అర్ధం చేసుకోలేక..ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకొని వచ్చిన వారితో పోటీపడలేక ఆత్మన్యూనతకు గురై మధ్యలోనే కోర్సును మానేస్తున్న విద్యార్థులు ఎంతో మంది.
  • రెండేళ్ల క్రితం యాస్పైరింగ్‌ మైండ్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లుగా పేర్కొనే ఐఐటీల్లో బిటెక్‌ చదివిన విద్యార్థుల్లో సైతం ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ స్కిల్స్‌ లేవని తేలడం విస్మయం కలిగించింది.కారణం స్కూల్‌ స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంలో చదవకపోవడమే. అంతేకాదు పదోతరగతి, ఇంటర్‌ వరకూ టాప్‌ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సైతం ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరాక ఇంగ్లిష్‌లో ఉన్న ఆయా సబ్జెక్టులకు భయపడి ఏకంగా చదువుపైనే ఆసక్తి కోల్పోతున్నా రు. నేటి ప్రపంచీకరణ యుగంలో ఇంగ్లిష్‌ లేకుంటే అడుగు బయటపెట్టలేని పరిస్థితి.
  • ఇంగ్లిష్‌ రాకుంటే ఎన్ని నైపుణ్యా లున్నా వృథానే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ను నేర్పించాలి. అందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలి అంటున్నారు నిపుణులు. అందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, ధనిక అనే తారతమ్యం చూపకుండా ప్రతి ఒక్కరికీ ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. తద్వారా భావి పౌరుల చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేసినట్లు అవుతుందంటున్నారు. మరోవైపు ప్రైవేట్‌లో అధికశాతం ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌ ఉంటున్నాయి.
  • తమ పిలల్లలను వీటిలో చేర్పిస్తే ఇంగ్లిష్‌లో చదువుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థానాలు అందుకుంటారనే ఆశతో తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి ఫీజులు కట్టి ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివిస్తున్నారు. మారుమూల గ్రామంలో నివశించే పేదలు సైతం తమకు సమీపంలో ఉన్న పట్టణంలోని ప్రైవేట్‌ స్కూల్స్‌లో చేర్పిస్తున్నారు. ఆయా ఇంగ్లి మీడియం పాఠశాలల్లో వేలకు వేలు ఫీజలు కట్టి అప్పుల పాలవు తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తే ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి ఇంగ్లిష్‌ మీడియం చదువులు, ఇంగ్లిష్‌ నైపుణ్యాలు లభిస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడు తున్నారు.
  • పలు అధ్యయనాల ప్రకారం పాఠశాల స్థాయిలో నేర్చుకున్న భాష జీవితాంతం వెన్నంటి ఉంటుంది. ఎందు కంటే ఆ వయసులో పిల్లల్లో గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, బ్రిటిష్‌ కౌన్సిల్‌, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలు నిర్వహించిన అధ్యయనంలో సైతం ఈ వాస్త వాలు వెల్లడయ్యాయి. కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించేలా పాఠశా ల స్థాయిలోనే పునాదులు వేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.
    ఇంగ్లిష్‌లోకి మారుతున్న దేశాలు:
  • అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌కు నెలకొన్న ప్రాధాన్యతను గుర్తించిన పలు దేశాలు ఇప్పుడు తమ జాతీయ భాషతో సంబంధం లేకుండా ఇంగ్లిష్‌ మీడియానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. మన పొరుగునే ఉన్న చైనా ప్రపంచీకరణ. మారుతున్న కార్పొరేట్‌ అవసరాలను గుర్తించి నాలుగేళ్ల క్రితమే ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను ప్రారంభించింది. ఫలితంగా ఇప్పుడు ఆ దేశం అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యపరంగా పలు దేశాలతో పోటీ పడుతోంది
  • . అంతేకాకుండా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ ఏ దేశ యూనివర్సిటీల్లో చూసినా సింహభాగం చైనా విద్యార్థులే. చైనాతో పాటు జర్మనీ,కొరియా, జపాన్‌ తదితర దేశాలు సైతం ఇంగ్లిష్‌కు పెద్దపీఠ వేస్తున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు. గత మూడు, నాలుగేళ్లుగా ఆటోమేషన్‌, ఐఒటీ విస్త్రతి పెరుగుతోంది. నేటి ఆటోమేషన్‌ యుగంలో కొలువు సొంతం చేసుకోవాలంటే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు తప్పనిసరి.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/