అమిత్ షా కన్వాయ్ కి అడ్డొచ్చిన కారు..అద్దాలు పగులగొట్టిన సిబ్బంది

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో ఓ ఘటన అందర్నీ కంగారుకు గురి చేసింది. అమిత్ షా కన్వాయ్ కి ఓ కారు అడ్డొచ్చింది. పక్కకు జరపాలని సిబ్బంది చెప్పినప్పటికీ..కారును పక్కకు తీయకపోవడంతో అమిత్ షా సిబ్బంది ఆ కారు అద్దాలు పగలగొట్టారు.

వివరాల్లోకి వెళ్తే ..

మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా హాజరయ్యారు. శుక్రవారం రాత్రే అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. ఈరోజు పరేడ్‌ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి , జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించి ప్రసంగించారు.

ఇక ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి.. హరితా ప్లాజాకు చేరుకున్నారుఅమిత్ షా. ఈ నేపథ్యంలోనే.. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కన్వాయ్ కి అడ్డొచ్చింది ఓ గుర్తు తెలియని వ్యక్తి కారు. అమిత్‌ షా కాన్వాయ్‌ వచ్చినా… అతను కారు పక్కకి తీయకపోవడంతో..అమిత్ షా సిబ్బంది బ్యాక్ అద్దం పగలగొట్టారు. ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం హరిత ప్లాజా లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా..తెలంగాణ బిజెపి నేతలతో సమావేశమయ్యారు.