మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశం

వేరే దేశం నుంచి ఇక్కడకు వచ్చిన వారు ఎవరైనా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే వారు ఇక్కడి పౌరులే

narendra modi
narendra modi

కోల్‌కతా: వేదింపులకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే సీఏఏ ముఖ్య ఉద్దేశమని దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వ హక్కును లాక్కోదని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆదివారం బేలూరు మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేరే దేశం నుంచి ఇక్కడకు వచ్చిన వారు ఎవరైనా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే వారు ఇక్కడి పౌరులే అవుతారనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. సీఏఏ అనేది దానికి సవరణ మాత్రమేనని అన్నారు. ఇతర దేశాల్లో కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి పౌరసత్వం కల్పించేందుకు మార్గం సుగమం చేస్తూ సీఏఏలో మార్పులు చేశామన్నారు. సీఏఏ ద్వారా మైనారిటీలకు బాసటగా నిలవాలన్న మహాత్మాగాంధీ ఆశయాలను, కలలను తమ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. పాకిస్థాన్‌, ఇతర దేశాల్లో చిత్రహింసలకు గురైన ప్రజలకు ఇండియాలో మానవతా దృక్పథంతో పౌరసత్వం కల్పించాలని ప్రభుత్వంలోని పలువురు పదేపదే చెబుతూ వచ్చిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/