బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపు

హైదరాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేసిందని తెలంగాణ శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ములిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా బడ్జెట్ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ పథకాలను మెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం కేటాయింపులను చేయలేదని విమర్శించారు. రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రాన్ని నిధులు కేటాయించమని ఎందుకు అడగరని ప్రశ్నించారు. రాష్ట్రా విభజన సమయంలో ఇచ్చిన హమీలను ఇంతవరకు నెరవేర్చలేదని కర్నే ప్రభాకర్ విమర్శించారు. బిజెపి దేశాన్ని తిరోగమనం పాలు చేస్తోందని దుయ్యబట్టారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/