గుంటూరులో అర్థరాత్రి దారుణ హత్య

Murder in guntur
Murder in guntur

గుంటూరు: అమరావతి రోడ్డులోని గౌతమి బార్ వద్ద శ‌నివారం అర్థ‌రాత్రి దారుణ హత్య జరిగింది. పాతకక్షల నేపథ్యంలో నాగూర్‌ను హత్య చేశారు. మద్యం మత్తులో ఉన్న నాగూర్‌ను గోపి ఇనే యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన గత రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/