ఏక పార్టీ పాలనకు అడుగులు వేస్తున్న బిజెపి

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌

ASHOK GEHLOT
ASHOK GEHLOT

జైపూర్‌: దేశంలో ఏక పార్టీ పాలనను తీసుకురావాలని బిజెపి ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ కీలక నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు. ఈ విషయం తెలియని మిత్రపక్షాలు ఆ పార్టీని నమ్మి, మద్దతిస్తున్నాయని చెప్పారు. బిజెపికి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, చైనాలో ఉన్న విధంగా ఏక పార్టీ పాలన దిశగా అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని బిజెపికి మద్దతిస్తున్న ప్రతి పార్టీ గ్రహించాలని హితవు పలికారు. గతంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన దిశగా బిజెపి అడుగులు వేస్తోందని ఆమె మండిపడ్డారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/