రుణవితరణలో వివేకంతో వ్యవహరించాలి

రుణాల వృద్ధిరేటు మందకొడిగా ఉండటమే బ్యాంకులకు పెద్ద సవాలు

shaktikanta das
shaktikanta das

ముంబయి: దేశంలో రు ణాల వృద్ధి రేటు మందకొడిగా ఉండడమే బ్యాంకు లు ఎదుర్కొంటున్న పెద్ద సవాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ప్రస్తుతం రుణ వృద్ధి రేటు 7 శాతానికి అటుఇటూగా ఉంది. ఆర్‌బీఐ నిర్వహణలోని వార్షిక బ్యాంకింగ్‌ సదస్సులో మాట్లాడుతూ రుణవితరణలో వివేకంతో వ్యవహరించాలని, నాణ్యత పరిశీలనకు ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు సూచించారు. దేశంలోని వివిధ ఆర్థిక సంస్థల పూర్వాపరాలపై పూర్తి స్థాయి అధ్యయనం నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 50 ఉన్నత స్థాయి ఎన్‌బీఎ్‌ఫసీల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. చిన్న స్థాయి ఎన్‌బీఎ్‌ఫసీలకు గత ఏడాది కాలంలో రుణప్రవాహం స్వల్పంగా పెరిగిందన్నారు. రియల్టీ రంగానికి రుణప్రవాహం మరింతగా పెరగాలని సూచించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటిలోనూ నిర్వహణ పెరగాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ రుణ మాఫీ ఎవరికి అవసరమో వారికి మాత్రమే పరిమి తం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/