ఈ మోహం నీకు ఎక్కడి నుంచి వచ్చింది?

భగవద్గీత ప్రవచనాలు

lord krishna
lord krishna

అధర్మము వృద్ధి చెందునని, కులస్త్రీలు చెడిపోవుదురని, స్త్రీలు చెడిపోతే వర్ణసంకరము ఏర్పడుతుందని, సంకరము చేసిన వారికి, సంకరము నొందిన కులమనకు నరకము వస్తుందని అర్జునుడు శ్రీకృష్ణునికి చెప్పి, నేను చచ్చినా పర్వాలేదు యుద్ధం చేయను గాక చేయను అన్నాడు.

నాకు విజయమూ వద్దు, రాజ్యమూ వద్దు అని రథములో కూలబడ్డాడు. శ్రీకృష్ణుడు ‘ ఈ సమయంలో ఈ మోహం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? క్షుద్రమైన హృదయ దౌర్బల్యం వీడి లే§్‌ు, అన్నాడు. ఆత్మతత్వాన్ని బోధించాడు.

‘నియతం కురు కర్మత్వం నీవు నియమింపబడిన కర్మను చె§్‌ు అని అన్నాడు. నాకు ఈ మూడు లోకాల్లో చేయవలసిన కర్మ ఏదీ లేదు. అయినా నేను కర్మను చేస్తూనే ఉంటాను.

ఎందుకంటే నేను చేయకపోతే జనులు నన్ను చూసి వారూ ఏ కర్మనూ చేయక సోమరులుగా ఉండి చెడిపోతారు. కర్మసంకరము కలుగుతుంది.

ఆ కర్మ సంకరానికి నేనే కర్తనవుతా, జనులను చెడగొట్టిన వానినవుతాను. అలా కర్మ సంకరము జరుగకూడదని నేను కోరుతాను అని చెప్పాడు. అర్జునుడు వర్ణ సాంకర్యాన్ని గూర్చి ఆందోళన చెందాడు. శ్రీకృష్ణుడు కర్మసాంకర్యాన్ని గూర్చి శ్రద్ధ వహించాడు. అత్యవసర, అనివార్య పరిస్థితుల్లో యుద్ధం చేయవలసిన క్షత్రియుడైన అర్జునుడు తన విద్యుక్త ధర్మానికి కాక ఇతరములైన వాటికి ప్రాధాన్యతనిచ్చాడు.

యుద్ధం చేస్తే, పురుషులెందరో మరణిస్తే, స్త్రీలు చెడిపోయి వర్ణసాంకర్యం ఏర్పడుతుందనుకొన్నాడు గానీ యుద్ధం చేయకపోతే కూడా తాను వర్ణధర్మాన్ని వీడినట్టవుతుందని వర్ణసాంకర్యమేర్పడునని గ్రహించలేకపోయాడు. ఎందుకంటే ఆయన మోహంలో ఉన్నాడు.

అజ్ఞానంలో ఉన్నాడు. అయితే జ్ఞాన స్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్ముడు మాత్రం వర్ణసాంకర్యం కంటే కర్మ సాంకర్యం చాలా కీడును కలిగిస్తుందన్నాడు. ఎవరి విద్యుక్త ధర్మాన్ని వారు శ్రద్ధగా, త్రికరణశుద్ధిగా చేయకపోతే ఈ ప్రపంచమేమవుతుందో మనం ఊహించలేము.

సాధు సన్యాసులు చేయవలసిన పనిని గృహస్తులు చేయవలసిన పనులను సన్యాసులు చేస్తే, రోగులు మింగవలసిన మందులను ఆరోగ్యవంతులు మింగితే, ఆరోగ్యవంతులు తినే తిండిని రోగులు తింటే వారికీ, వీరికి అనారోగ్యమై, అంతా అస్తవ్యస్తమై మరణమే సంభవించవచ్చు.

‘చాతుర్వర్ణ్యం మయా స్పష్టమ్‌ అని చెప్పిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే వర్ణసాంకర్యాన్ని గూర్చి ఆలోచించనివ్వండి. కర్మసాంకర్యం జరుగకుండా చూడవలసిన బాధ్యత మనది. మన కర్మను మనం చేద్దాం నిష్కామంగా, ఫలాపేక్షలేకుండా. అదే మనకు శ్రేయస్కరం శ్రీకృష్ణునికి ప్రతికరం.

– రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/