పిల్లలకోసం భగవద్గీత

ఏదైనా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో చెబితేనే వారు ఆసక్తి చూపుతారు. చెప్పాలనుకున్న అంశం వారి మనసులో బలంగా నాటుకుంటుంది. పురాణాలు, వేదాల్లోని మంచిని పెద్దలతో పాటు పిల్లలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో భగవద్గీత, ఉపనిషత్తుల మీద పిల్లల భాషలో పుస్తకాలు రాశారు పిల్లల పుస్తకాల రచయిత్రిగా ఎంతో అనుభవమున్న రూప పాయ్. బెంగుళూరుకు చెందిన రూప పాయ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు. భర్త ఉద్యోగరీత్యా ఢిల్లీ, ముంబయిలతో పాటు న్యూయార్క్, లండన్, ఒర్లాండో వెళ్లొచ్చారు. రూపా చిన్నతనంలో బ్రిటన్‌కు చెందిన పుస్తకాల రచయిత ఎనిండ్ బ్లెటన్ రాసిన పుస్తకాలు చదివారు.
బ్రిటిన్‌లోని పిల్లలు, తాను మాత్రమే బాల్యాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నామని ఆమె అనుకుని మురిసిపోయే వారు. ఆ తరువాత భారత్‌లో ఇంగ్లీష్‌లో ప్రింట్ అయ్యే పిల్లల మ్యాగజైన్ టార్గెట్ చదివాక. రూపాకు ఆ పుస్తకం బాగా నచ్చింది. ఆ పుస్తకంలోని కథలు చదివి ప్రస్తుత ప్రపంచానికి సమాంతరంగా మరొక ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నారు.
అది కూడా భారతీయ పిల్లలకు సంబంధించిగా ఉండాలని భావించేవారామె. పిల్లల పుస్తకాల రచన ప్రారంభించాలనుకున్న రూపా హ్యాచెట్, మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. చిల్డ్రన్ బుక్స్ మీదున్న ఆసక్తితో సైన్స్ ఫిక్షన్ బొమ్మలతో ఉన్న ఎనిమిది పుస్తకాల సిరీస్, తారానాట్స్ రాసారు. ఆ రచన నాలుగేళ్లపాటు సాగింది. అదే ఉత్సాహంతో వాట్ ఇఫ్ ఎర్త్ స్టాప్డ్ స్పిన్నింగ్ పుస్తకం తెచ్చారు. వత్సల కౌర్ ప్రోత్సాహంతో పిల్లలకు భగవద్గీత అవసరమనుకున్నారు. పురాణాల గురించి బంధువుల ద్వారా తెలుసుకున్నారు. ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య జరిగిన సంభాషణ భగవద్గీత అని తెలుసుకుని అందులోని జీవిత సత్యాల్ని ఈ తరం పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పుస్తకంగా తీసుకురావాలనుకున్నారు.
పుస్తక రచనకు పూనుకుని హిందూ ధర్మాలను పరిశీలించారు.కష్టతరమైన అంశాలను సులభమైన రీతిలోకి మార్చి ‘ద గీత ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ క్రమంలో ఎంతో సంతోషాన్ని పొందిన ఆమెకు ఎక్కడో కొంత తేడా అనిపించింది. దాంతో రచయిత, భారతీయ చరిత్ర, సంస్కృతి మీద బాగా అవగాహన ఉన్న వివేక్ దిబ్రో§్‌ు గారికి ఆ పుస్తకాన్ని చూపించారు. మహాభారతాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లీష్‌లోకి వాల్యూమ్స్ అనువాదం చేసిన ఆయన దాన్ని చూసి తప్పకుండా ముద్రించమని చెప్పారు. తన ప్రయత్నం వృథా కాలేదని సంతోషించారు.
వేలకు పైగా కాపీలు అమ్ముడుపోయిన ‘ద గీత ఫర్ చిల్డ్రన్ పుస్తకం చిల్డ్రన్ బుక్స్ జాబితాలో నాలుగేళుల్గఆ టాప్‌లో ఉండడం విశేషం. ఆ తరువాత ద వేదాస్ అండ్ ఉపనిషద్స్ ఫర్ చిల్డ్రన్ పుస్తకాన్ని తెచ్చారు. ఈ పుస్తకాన్ని పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఇష్టంగా చదువుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి పుస్తకాలు చదవాలనేది రూపా కోరిక. పిల్లల పుస్తకాలు రాయడం మొదలు పెట్టాక తన జీవితంలో ఆచలా మార్పు వచ్చిందంటారు ఆమె.
సమాజాన్ని చూసే దృష్టికోణం కూడా మారిందంటారు. ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాలు చదివే ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, చర్చలు వింటున్నారు. జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తున్నారు. పెద్దల చదివే పుస్తకాలు రాయడం కన్నా పిల్లల పుస్తకాలు రాయడంలో సౌకర్యముందంటారు. ‘ అహం బ్రహ్మా స్మీ ఈ సువిశాల విశ్వంలో పిల్లలు ఒక చిన్న జీవి కాదు. మీలోనే విశ్వం అంతా ఉంది. ఎప్పుడూ నిరాశకు గురి కావద్దు అని రూపా పిల్లలకు చెబుతారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/