భగవద్గీత

ఆధ్యాత్మిక చింతన

The Bhagavad Gita
The Bhagavad Gita

అజ్ఞశ్చాశ్రద్ధ ధానశ్చ సంశయాత్మావినశ్యతి,
నాయం లోకోస్తి నపరోన సుఖం సంశయాత్మనః!!

ఇది భగవద్గీత నాల్గవ అధ్యాయంలోని 40వ శ్లోకం. దీని భావం- అజ్ఞాని, అంటే శ్రద్ధలేని వాడు మరియు పరలోకం లేదు, సుఖమూ లేదు. (పుట 151-శ్రీ మద్భగవద్గీత-శంకర భాష్య ము-రామకృష్ణ మఠంఇక శంకరాచార్యులవారి భాష్యాన్ని చూద్దాం
అజ్ఞాని ఆత్మను తెలియనివాడు. శ్రద్ధలేనివాడు, గురు వాక్యంలో, శాస్త్రంలో నమ్మకం లేనివాడు. సంశయాత్ముడు, సందేహించే చిత్తం కలవాడు. అటు వంటివాడు నశిస్తాడు. అజ్ఞానిత్మను తెలియని వాడు. శ్రద్ధలేనివాడు, గురు వాక్యంలో, శాస్త్రంలో నమ్మం లేనివాడు. సంశయాత్ముడు, సందేహించే చిత్తం కలవాడు. అటుంటి వాడు నశిస్తాడు. అజ్ఞాని, శ్రద్ధలనివాడు వీరిద్దరూ నశిస్తారు. కాని సంశ యాత్ముని వలెకాదు. వాడు అందరిలోకి పాపిష్ఠుడు. ఎట్లా? వాడికి ఈ సాధారణ ప్రపంచమే లేదు, పరలోకములేదు, సుఖమూ లేదు.

అక్కడ కూడా వాడికి సంశయమే. కనుక సంశయము వానికి పనికి రాదు. (ఫుట 152-శ్రీ భద్భగవద్గీత- శంకర భాష్యము- రామకృష్ణ మఠం) ఇలాంటి శ్లోకాల్ని , భాష్యా లని చూపి ఈనాడు ఎందరో పండితులు, ప్రవచనకారులు, స్వామీజీలు ప్రజల్లో ఆలోచనా శక్తిని నశింపచేసి, మూఢ విశ్వాసా లను పెంచి పోషిస్తున్నారు.

శ్రీ కృష్ణ పరమాత్ముడు అజ్ఞాని, శ్రద్ధల నివాడు, సంశయాత్ముడు అని తన శ్లోకంలో చెప్పి ఉంటే శంకరా చార్యుల వారు తమ భాషంలో ‘గురువాక్యంలో, శాస్త్రంలో నమ్మకం లేనివాడు అని కలుపుతున్నాడు. సరే, గురువు అంటే ఎవరు? శాస్త్ర మంటే ఏది? నాలుగు శ్లోకాలు చెప్పగల పత్రీవాడు గురువా? ప్రతి పురాణము శాస్త్రమా? ఏ సంశయమూ లేక, ఏ సందే హమూ వెలిబుచ్చక ప్రతి వానినీ, ప్రతి గ్రంథాన్ని నమ్మితే ఏ మవుతుందో ప్రత్యేకంగాచెప్పాలా? వెంటనే వచ్చే 41వ శ్లోకం ఇది – యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయమ్‌! ఆత్మ వన్తం న కర్మాణి ని బధ్నన్తి ధనంజయ !

దీని తాత్పర్యం-

ఓ అర్జునా! నిష్కామ కర్మ యోగముచే కర్మఫలమును త్యజించిన వాడును, జ్ఞానముచే సంశయములు నివర్తించిన వాడునగు ఆత్మ నిష్ఠుని కర్మములు బంధింప నేరవు. ఇక్కడ సంశయాన్ని జ్ఞానంతో ఛేదించినవాడు అని కృష్ణుడంటు న్నాడు. అంటే జ్ఞానం మాత్రమే అన్ని సంశయాలను, అన్ని సందే హాలను రూపు మాపగలదు. జ్ఞానం అంటే ఉత్త శాస్త్ర పాండిత్యం కాదు, సొంతంగా అనుభవ పూర్వకంగా తెలుసుకొన్న విషయం.

అందుకే గౌతమ బుద్ధుడు. శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి వ్యక్తులు వారు చెప్పిన దాన్ని కూడా గ్రుడ్డిగా నమ్మవద్దని బాగా పరీక్షించి, పరిశీలించిన తర్వాతనే నమ్మమని చెబుతారు. నిజానికి అజ్ఞానంలో వున్న వ్యక్తికి ఎంత మహాత్ముని విషయమైనా, అతని బోధన విష యమైనా ఏదో ఒక మూలలో సంశయందాగే ఉంటుంది. సందేహం ఉండేతీరుతుంది.

వ్యాపారస్థులు రూపాయి నాణాన్ని మ్రోగించి పరీక్షించిన విధంగా తనను కూడా పరీక్షించిన పిమ్మట మాత్రమే గురువుగా అంగీకరించమని శ్రీరామ కృష్ణులు తన శిష్యులను హెచ్చరించేవారు. స్వామి యోగానంద ఒక రోజు అర్ధరాత్రి మెళకువ వచ్చిలేచాడు. ప్రక్కన మం చం మీద రామ కృష్ణులు కనపడ లేదు. ఆయన బహిర్భుమికి వెళ్లారేమో అనుకొని సామాన్యంగా రామ కృష్ణుడు ప్రక్షాళన కోసం వాడే నీటి పాత్రకోసం చూశాడు.

అది ఉన్న చోటనే ఉంది. ఒకవేళ గురుదేవులు బయపచార్లు చేస్తున్నారేమోనని చూశాడు. ఆయన అక్కడా కనపడ లేదు. అతనికి రాకూడని అనుమానం వచ్చింది. శారదామాత ఉన్న గది బయట నిలబడి గదిలో నుంచి రామకృష్ణుడు వస్తాడేమోనని ఎదురు చూశాడు.

రామకృష్ణుడు వచ్చాడు. గదిలోనుంచికాదు, పంచవటి నుంచి, స్వామి యోగానంద ముఖాన్ని చూస్తూనే ఆయనకు అసలు విషయం అర్థమైంది. యోగీంద్రుడు తనను పరీక్షించడంపట్ల ఆయనకు కోపం రాలేదు. సరికదా ‘బాగుంది. నువ్వు చేసింది మంచిపనే అని మెచ్చుకొన్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/