భగవద్గీత

ఆధ్యాత్మిక చింతన

The Bhagavad Gita
The Bhagavad Gita

ఒకసారి జ్ఞానేశ్వరానంద స్వామి ప్రేమానందస్వామితో మాట్లాడుతూ భగవద్గీతను గూర్చి అవును! అనేది చదివాను, అన్నాడు వెంటనే ప్రేమానందస్వామి నాయనా! నేను గీత చదువుతున్నాను అను. గీత చదివాను అని ఎన్నడూ అనకు. ఎవరూ గీతను చదవటం ఎన్నడూ పూర్తి చేయలేరు. అని చెప్పాడు

దైవంతో సహజీవనం. నిజమే, భగవదీగతను ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లూ క్రొత్త అర్థాలే వస్తాయి. అది కొత్తగా కనపడుతుంది. అంతేకాదు, చదివేవారి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. కాలం గడిచేకొద్దీ భగవద్గీత రూపం కూడా మారిందని కొందరంటారు. అసలు భగవద్గీత 84 శోకాలు
మాత్రమే అని కొందరంటారు. (శార్వరి-గీతాసాంఖ్యం). త్రైతసిద్ధాంతకర్త ప్రబోధానంతస్వామి వారు కూడా భగవద్గీతలో ఎన్నో కల్పిత శ్లోకములు ఉన్నయని అభిప్రాయపడ్డారు. వారు 578 శ్లోకాలనే శ్రీ కృష్ణుని బోధగా గ్రహించారు. భగవాన్‌ రమణ మహర్షి ప్రొ.వి.బి. అథావలె (గీత విద్యాంసులు)కు 740 శ్లోకాలున్న భగవద్గీతను చూపారట. 45 అధిక శ్లోకాలతో ప్రాచీన భగవద్గీతను డాక్టర్‌ వేదవ్యాస ఐఎఎస్‌ వ్రాశారట
(4వ పుట-సమర్పణ-1999 కలియుగాంతం) కాబట్టి భగవద్గీతను కేవలం చదవటంకాదు, కడు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, పరిశీలించాలి, పరిశోధిం చాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిశ్న్రేన సేవయా ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శినః ఇది భగవద్గీత 4వ అధ్యాయములోని 34వ శ్లోకం దీని అర్థం – (గురువును చేరి) నమస్క రించ ప్రశ్నించి సేవించి అని తెలిసికో, తత్త్వం దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు. (పుట 147- శ్రీమద్భగవద్గీత- శంకరభాష్యము, రామకృష్ణమఠం) దీని ముందు శ్లోకంలో ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం మేలైనది అని చెప్పాడు శ్రీకృష్ణుడు.

జ్ఞానాన్ని పొందం ఎట్ల? గురువును ఆశ్రయించి, శశ్రూషచేసి, విన యంగా ప్రశ్నించి తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు ఈ 34వ శ్లోకంలో చెప్పినట్టు ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే బోధిసు తన్నప్పుడు మరొక గురువును ఆశ్రయించ అని ఆయన అర్జునకు చెప్పి ంటాడా? లేక దీన్ని ఎవరైనా భగవద్గీతలోకి జొప్పించి ఉంటారా? తర్వాత వచ్చే 38వ శ్లోకాన్ని చూద్దాం. నహిజ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని వినతి ఈ శ్లోక భావం-జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఈ లోకంలో మరొకటి లేదు.

దానిని నీవు యోగసిద్ధుడవై కాలక్రమంలో నీలోనే పొందుతావు. అంతేకాదు ఆ తర్వాత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉద్ధరేదాత్మ నా త్మానమ్‌ అని కూడా ఆయన బోధించాడు. దీన్ని బట్టి చూస్తే ఏదో గురువును ఆశ్రయించి, వినయం శుశ్రూషచేసి, ఆయన్ను
మెప్పించి జ్ఞానాన్ని పొందు అను అర్థంగల శ్లోకాన్ని ఎవరో జూప్పించి వుంటారనే అనిపిస్తుంది. శిష్యులను పొందాలని, వారిని తమ చెప్పుచెతల్లో పెట్టుకోవాలని, వారి ధన మానాలను దోచుకోవాలని, వారి పెత్తనం నిలుపుకోవాలని ఆశించేవారెవరో అలా చేసి ఉండవచ్చు, నిజానికి ఆ శ్లోకాన్ని తీసివేస్తే కూడా శ్రీ కృష్ణునిబోధన బోధపడదు. ఏ ఆటంకము

లేక సాగిపోవటం మనం సులభంగా గ్రహించవచ్చు. ఆ శ్లోకాన్ని శ్రీ కృష్ణ పరమాత్ముడే చెప్పి ఉంటాడని జనులను నమ్మించి, జ్ఞానోద యమయేట్టు చేస్తామని మభ్యపెట్టి ఎంతమంది దొంగ స్వామీజీలు, బూటకపు బాబాలు వెలిగి పోతున్నారో మన దినపత్రికలు ఎప్పుడు ఘోషిస్తూనే ఉన్నాయి. ఎందరి అమాయకుల జీవితాలో నాశనమువుతున్నాయి.

ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ‘గురువులను శిష్యులు భ్రష్టుపట్టిస్తారు. శిష్యులను గురువులు భ్రష్టు పట్టిస్తారు. అని అంటారు. నిజమే శిష్యులు నాశనమవుతున్నారు, గురువులు కటకటాల పాలుతున్నారు. విదేశాలకు చెక్కేస్తున్నారు. అసైన గురువు లోపలేమి ఉంటాడు. బయట గురువేకావాలి. పాదనమస్కారభాగ్యం కలిగించాలి అనుకునేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

వారు మనసారా కేవలం జ్ఞానాన్నివ్వగల గురువునే కోరుకొంటే, దైవకృపచేత వారికొక రామకృష్ణు లభించవచ్చు, రమణుడు లభించవచ్చు, మలయాళస్వామి లభించవచ్చు. అందుకు వారు అర్హువుదురుగాక!

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/