చంచల్ గూడ సెంట్రల్ జైలుకు విశిష్ట పురస్కారం

దక్షిణ భారతదేశంలో ఉత్తమ కారాగారం చంచల్ గూడ

chanchalguda jail
chanchalguda jail

హైదరాబాద్‌: హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉన్న చంచల్ గూడ సెంట్రల్ జైలుకు విశిష్ట పురస్కారం దక్కింది. దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ జైలుగా చంచల్ గూడ అవార్డు అందుకుంది. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన అకాడమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఇటీవలే ఈ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ జైళ్ల శాఖ డీఐజీ ఎమ్మార్ భాస్కర్, చంచల్ గూడ జైలు సూపరింటిండెంట్ డి. శ్రీనివాస్ వెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును స్వీకరించారు. అంతేకాదు, ఓపెన్ ఎయిర్ జైలు విభాగంలో చర్లపల్లి జైలులోని ఖైదీల వ్యవసాయ క్షేత్రానికి కూడా అవార్డు లభించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/