ఉత్తమోత్తమమైనది మానవ జన్మ

ఆధ్యాత్మిక చింతన

The best is human birth
The best is human birth


మానవ జన్మ ఉన్నతమైనది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తేనే మానవ జన్మ వచ్చేది. అందుకే మానవ జన్మ ఓ వరం లాంటి అంటారు. వరలా లభించిన ఈ మానవ జన్మ పరోపకారానికై వినియోగించాలి. సంఘ కార్యక్రమాలకు వెచ్చించాలి. స్వార్థం ఉండకూడదు, లాభాపేక్ష కూడదు. నిస్వార్ధమైన సేవా లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి వారే ఉత్తములు అంటారు.

వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అసౌకర్యాలు కలిగినా అతడు గొడకేసి కొట్టినబంతిలా తిరిగి తన సాధనా క్రమానికే వచ్చేస్తాడు. ఈ సృష్టిలో భగవంతుని నోరారా పిలువ గలిగే అధికారం ఒక్క మానవ్ఞడికే ఉంది. 84 లక్షల జీవ రాశులలో ఒక్క మానవునికికే రామ, కృష్ణా, గోవిందా అని పిలిచే భగ్యం దక్కుతుంది.

ఆది చాలు ఈ జన్మకు మానవసేవ మాధవ సేవ అని అంటారు నిజమే మానవుడికి సేవ చేస్తే అది సాక్షాత్తు ఆ పరమాత్మకు చెందుతుందనేది నగ్న సత్యం. కోపం, క్రోధం, అహం, గర్వం, పళ్లు కొరుకుతూ తీక్షణ చూపులు చూడటటం ఉత్తమ మానవ్ఞనికి తగవు. మానవుడు ఎల్లప్పుడూ సాధు స్వభావం కలిగి ఉండాలి. ఒకరు దూషించివా తిరుగుబాటు వ్ఞండకూడదు. ఓర్పు, సహనం అవసర. ఈ విషయంలో ఏసు ప్రభువ్ఞ మనకు ఆదర్శం.

అతను చేయని నేరానికి ఎన్నెన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖంపై ఉమ్మి వేశారు. వీపుపై పిడిగుద్దులు గుద్దారు. దాహం అని అడిగితే చేదు నీరు ఇవ్వడం, హింసించడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్నీ తనపై ఉపయోగించారు. అయినా యేసుప్రభువ్ఞ తొణక లేదు, తిరుగుబాటు చేయ లేదు. మౌనిలా ఉన్నాడు.

ఒక్కో కొరడా దెబ్బ వీపుపై చిర్రుమని పడుతుంటే తండ్రి పేరేమీ చేయుచున్నారో తెలియదు. వీరిని క్షమించండి. అని చెప్పిన ఏకైక సాధుమూర్తి మనకు చరిత్రలో ఎవరూ కనపడరు. ఇటువంటి వారు ఉత్తమ శ్రేణికి చెందినవారు. ఉత్తమ జన్మ అనేది ధైవెచ్చలాంటిది. ఈ లోకంలో నేడు జీవిస్తున్న పతి ఒక్కరూ ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నారా లేదు. అనే ప్రశ్న ఎక్కువగా ఉదయిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపులే, ఆ పాపులను పిలవడానికి, ఆ పాపాలను ప్రక్షాళన చేసే నిత్య, శుద్ధ జీవితం ఇచ్చుటకే యేసుప్రభువ్ఞ వచ్చాడు.

మానవునిది ఉత్తమ జన్మ అని, ఆ జన్మను మనం వించినంత ంల అంతా సేవా కార్య క్రమాల్లో వినియోగించుకుని ఉన్నంతలో దాని చేసి పదాన్యులు అనిపించుకోవాలి. అప్పుడే మానవ జన్మకు అర్ధం, పరమార్థం వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

– కనుమ ఎల్లా రెడ్డి,

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/