అభివృద్ధి విస్తరించేలా బీసీజీ నివేదిక ఉంది

గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కావొద్దని ఆ నివేదికలు స్పష్టంగా చెప్పాయి

Mopidevi Venkataramana
Mopidevi Venkataramana

అమరావతి: పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేలా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక ఉందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వేసిన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ, జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ ఇచ్చిన నివేదికల్లో సారాంశం ఒకటేనని మోపిదేవి అన్నారు. పారిపాలన, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దని ఆ నివేదికలు స్పష్టంగా చెప్పాయని మోపిదేవి తెలిపారు. పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాజధాని రైతులు ఎవరూ ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/