ఆర్టీసి సమ్మెపై నెలకొన్న సందిగ్ధత

RTC Strike
RTC Strike

హైదరాబాద్‌: ఆర్టీసి కార్మికుల సమ్మె విషయంలో హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది? దీనికి ముగింపు ఎక్కడ? అసలు ఈ సమ్మెకు ఫలితమేంటి? ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వమేమో సమ్మె చట్ట విరుద్ధం, విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అంటూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే ఈ ప్రశ్నలకు హైకోర్టు తీర్పు సమాధానం ఎలా ఉండబోతుంది. ఇలాంటి సమయంలో సోమవారం విచారణ తరువాత ధర్మాసనం ఏం చెప్పనుందనే ఆసక్తి నెలకొంది. కాగా కార్మికుల ఆత్మహత్యలపై మరో పిటిషన్‌, సమ్మె చట్ట విరుద్ధమని ఐదు పిటిషన్లు, రూట్ల ప్రైవేటీకరణ అంశంపై విచారణ జరపాల్సి ఉంది. అయితే ఆర్టీసి సమ్మెపై సోమవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports