ఆప్ఘన్‌ బాలిక సాహసం

స్నేహితురాళ్లతో కలిసి వెంటిలేటర్‌ తయారీ

making of ventilator
Making of ventilator

ముఖ్యాంశాలు

  • కరోనా బాధితులకు చేయూతగా 14ఏళ్ల ఫరూఖీ ముందడుగు
  • ప్రపంచ రొబో ఒలింపియాడ్‌లో పాల్గొంది
  • ఆ అనుభవంతోనే వెంటిలేటర్ల తయారీ
  • కష్టకాలంలో ఎంతో మందికి స్ఫూర్తి

కరోనా బాధితుల కోసం ఒక బాలిక తన స్నేహితురాళ్లతో కలిసి వెంటిలేటర్‌ తయారు చేసింది.

అది ఎక్కడో కాదు ఆర్థికంగా బాగా వెనుకబడిన ఆఫ్ఘనిస్తాన్‌లో. ఆ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడ 900 వందల పైనే కేసులు నమోదయ్యాయి.

30 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 4 కోట్ల జనాభా ఉండే ఆఫ్ఘనిస్తాన్‌లో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సరైన వెంటిలేటర్లు కూడా లేవు.

కోటి మందికి వంద వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని అక్కడి అధికారులు అంటున్నారు.

ఇది తెలిసిన ఆఫ్ఘనిస్తాన్‌ బాలిక ఫరూఖీ ఆందోళన చెందింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చురుగ్గా ఉండే పధ్నాగేళ్ల ఫరూఖీ అమెరికాలో జరిగిన తొలి ప్రపంచ రొబో ఒలింపియాడ్‌లో పాల్గొంది.

ఆ అనుభవంతోనే తన స్నేహితులతో కలిసి వెంటిలేటర్లను తయారు చేయాలనుకుంది. తన ఆలోచనను తండ్రికి తెలుపగా ఆయన ఒప్పుకోవడమే కాదు.

ఆమెను ప్రోత్సహించారు కూడా. ఫరూఖీ తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి హెరాట్‌ నగర శివారులో ఉన్న మెకానిక్‌ వర్క్‌షాప్‌కు వెళ్లింది. ఆ దేశంలో కూడా కర్ఫ్యూ పెద్దఎత్తున కొనసాగుతోంది.

అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. ప్రజల్ని ఎలాగైనా కాపాడాలన్న సంకల్పంతో ముందుకే అడుగు వేసింది. వర్క్‌షాప్‌లో రెండు డిజైన్లపై పని చేశారు.

వాటిలో ఒకటి మసాచ్యూసెట్స్‌ ఇనిస్టిట్యూట ఆఫ్‌ టెక్నాలజీకి చెందినది.

ఒక టయోటా కారు విండ్‌షీల్డ్‌ వైపర్‌తో పాటు, బ్యాటరీలను కూడా వాడారు. వెంటిలేటర్‌ ఫ్రేమ్‌ను తయారు చేయడంలో వారికి కొంత మంది మెకానిక్‌లు సహాయపడ్డారు.

ఇది తెలిసిన టెక్‌ ఎంట్రప్రెస్యూర్‌ ఫరూఖీ బృందానికి ఆర్ధిక సాయం చేసింది. వెంటిలేటర్‌ మోడల్‌ పూర్తి కాగానే దాన్ని పరీక్షించేందుకు ఆరోగ్యశాఖకు పంపించారు.

వారు దాన్ని ప్రయోగించి పరీక్షించాల్సి ఉందని, అది విజయవంతమయితే అనుమతి లభిస్తుందని ఫరూఖీ అంటున్నది.

కారు విడిభాగాలతో నలుగురు యువతులు చేసిన ప్రయోగం ప్రశంసించదగినదని, వారి ప్రయత్నం ఈ కష్టకాలంలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని పలువురు అంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/