ఆ లేఖ నకిలీది..దానిపై సంతకం చేయలేదు

Navy, Army and Air Force
Navy, Army and Air Force

న్యూఢిల్లీ: త్రివిధ దళాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవదంటూ మాజీ సైనికాధికారులు ప్రధాని మోడి ప్రభుత్వపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఈరోజు ఉదయం లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన విషయ తెలిసిందే. అయితే ఆ లేఖలో మాజీ సైనిక అధికారులు కోరారు. రాష్ట్ర‌ప‌తికి సంధించిన‌ ఆ లేఖ‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ లేఖ ఓ న‌కిలీద‌ని మాజీ జ‌న‌ర‌ల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ తెలిపారు. దానిపై సంత‌కం చేయ‌లేద‌ని రోడ్రిగ్స్ స్ప‌ష్టం చేశారు. 42 ఏళ్లు ర‌క్ష‌ణ‌శాఖ‌లో సేవ‌లందించాను అని, మ‌రి ఇలాంటి లేఖ‌లు రాసింది ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని రోడ్రిగ్స్ అన్నారు. మాజీ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఎన్‌సీ సూరి కూడా సైనికాధికారుల లేఖ‌ను కొట్టిపారేశారు. ఆ లేఖ‌తో త‌న‌కు సంబంధం లేద‌న్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/