అవి ఎఫ్‌-16 విమానాలు కాదు

చైనా, పాక్‌ తయారీ జెఎఫ్‌-17 విమానాలే
పాక్‌ రక్షణరంగప్రతినిధి సమర్ధన

JF-17 aeroplane
JF-17 aeroplane

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మిలిటరీ తాము చైనాతో కలిసి సంయుక్తంగా రూపొందించిన జెఎఫ్‌-17 విమానాన్ని మాత్రమే వైమానిక దాడులపరంగా వినియోగించామని, భారత్‌విమానాలు పాక్‌ గగనతలంలోనికి చొచ్చుకుని రావడంపై పాక్‌ వైమానిక దళాలు జెఎఫ్‌-17 విమానాలను వినియోగించినట్లు వెల్లడించింది. పాక్‌ మిలిటరీ అధికారప్రతినిధి తమవద్ద ఈ కార్యకలాపాల ఫుటేజి కూడా ఉందని వెల్లడించారు. అమెరికా ఎఫ్‌16 యుద్ధవిమానం కాదని, జెఎఫ్‌17 యుద్ధవిమానాలను వినియోగించామని వెల్లడించింది. భారత్‌వైమానికదళంతో జరిగిన గగనతలంయుద్ధంలో తాము వాడింది భారత్‌ చెపుతున్నట్లుగా ఎఫ్‌-16 కానేకాదని వాదించింది.

పాకిస్తాన్‌ ఆర్మీ అధికారప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ మాట్లాడుతూ భారత్‌ యుద్ధవిమానాలు పాకిస్తాన్‌ గగనతలంలోనికి గతనెల 26వ తేదీ ప్రనవేశించాయని, అంతేకాకుండా కొన్ని బాంబులనుసైతం వదిలాయని, అయితే వాటివల్ల తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించారు. పాకిస్తాన్‌ చేపట్టిన ఈ దాడులకు ప్రతీకారంగా భారత్‌ వైమానిక దళం జైషేముహ్మద్‌ ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వమించింది. ఎఐఎం-120 ఆమ్‌రామ్‌ క్షిపణులను ఎఫ్‌-16 విడుదలచేసిందని ఆధారాలు వెల్లడించాయి. ఇవన్నీ భారత్‌ప్రాంతంలోనే పడిపోయాయయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ సంతకాలను పోలిస్తే ఇవి ఎఫ్‌-16 యుద్ధవిమానాలను వినియోగించినట్లు తేలిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెరికా హోంశాఖ దీనిపై మరింత సమాచారం ఇవ్వాలని ఒప్పందానికి విరుద్ధంగా ఎఫ్‌-16 విమానాలను వినియోగించారా అన్న వివరాలను కోరింది.

అయితే ఆరోజు తాము జెఎఫ్‌17 విమానాలను వాడామని, చైనాతోకలిసిసంయుక్తంగా తయారుచేసినట్లు పాక్‌ వెల్లడించింది. అమెరికాతో స్నేహబంధాన్ని కోరుతున్న పాకిస్తాన్‌ జెఎఫ్‌17 విమానాలను వినియోగించడంపై అగ్రరాజ్యంతోచర్చలుజరుపుతున్నది. స్వీయరక్షణకోసం దేశం అవసరమైన యుద్ధవిమానాలను వినియోగించవచ్చని సమర్ధించుకుంటున్నది. తాము ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలమన్న జవాబుచెప్పేందుకే పాకిస్తాన్‌ ఈ విమానాలను వినియోగించిందని వెల్లడించారు. పాకిస్తాన్‌ యుద్ధాన్ని కోరుకోవడంలేదని, అలాగని దాడులకు పూనుకుంటూ సమర్ధంగా తిప్పికొడతామని గఫూర్‌ వెల్లడించారు.

భారత్‌ చేపట్టినపక్షంలో పాకిస్తాన్‌ కూడా అణునిరాయుధీకరణ చేపడుతుందని వెల్లడించారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు చేపట్టే ఏ చర్యలనైనా పాకిస్తాన్‌ మద్దతిస్తుందని, స్వాగతిస్తుందని గఫూర్‌ వెల్లడించారు. రష్యా రక్షణరంగ సహకారాన్ని కూడా కోరుతున్నదని, వైమానిక, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల్లోను, యాంటి ట్యాంక్‌ క్షిపణులపరంగా రష్యా సాంకేతిక సహకారం కోరుతున్నట్లు వెల్లడించారు. అమెరికాతో బెడిసికొడుతున్నసంబంధాలతో ఇపుడు పాకిస్తాన్‌ రష్యా,చైనావైపు మైత్రీబంధం పటిష్టంచేసుకునేందుకు దృష్టిసారించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/