స్వీపర్లకు, నర్సులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు

Harish Rao

హైదరాబాద్‌: కరోనా టెస్టింగ్‌ సెంటర్‌ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో, ఆర్వీఎం ఆసుపత్రిలో ఐసిఎంఆర్ అనుమతి అనంతరం ప్రారంభించబడుతాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కష్ట కాలంలో ఆర్వీఎం ఆసుపత్రి ముందుకు వచ్చి కరోనా పేషంట్లకు సేవ చేస్తాననడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఆసుపత్రిల్లో 4 తరగతి కేటగిరీలో పనిచేస్తూ సేవలందిస్తున్న స్వీపర్లకు, నర్సులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి అనుమానం ఉన్న గజ్వేల్లోనూ సిద్దిపేటలో పరీక్షలు చేస్తున్నారు.. చేయించుకోవాలని సూచించారు. అన్ని పి‌హెచ్‌సి‌ల్లో రాపిడ్ టెస్టులు చేస్తున్నామన్నారు. అందుకు ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను ఆదేశించిందని చెప్పారు. కరోనా పేషంట్లు ఎంతమంది వచ్చిన చికిత్స చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉన్న కూడా ఆసుపత్రికి వచ్చి ప్రభుత్వానికి సహకరించండని కోరారు. కరోనా కష్ట కాలంలో పోలీసు, వైద్యులు మన కోసం కృషి చేస్తురని, వారికి మరింత సహకరించాలన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/