‘సై అంటే సై రా’ అంటున్న నాగ చైతన్య

వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య..ప్రస్తుతం ‘థాంక్యూ’ మూవీ తో జులై 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకోగా..తాజాగా చిత్రంలోని ‘సై అంటే సై రా.. సంసిద్ధం లేరా..’, ‘మారో మారో యుద్ధం మొదలు..తాడో పేడో..తేల్చెయ్‌ ఇప్పుడు’ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇందులో నాగ చైతన్య హాకీ ఆడుతూ కనిపిస్తాడు. ‘ఇక్కడ ఒకరంటే ఒకరికి పడదు.. గ్యాంగ్‌.. గ్యాంగ్‌ బ్రదర్‌ అంటూ ఒంటినిండా పొగరు’ అంటూ మొదలయ్యే ఈ మారో మారో లిరికల్‌ పాటకు విశ్వ అండ్‌ కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. తమన్‌ సంగీతం అందించగా.. దీపు, పృథ్వీచంద్రలు పాడారు.

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నాతో పాటు మాళవిక నాయర్,అవికాగోర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు. మరోవైపు నాగచైతన్య దర్శకుడు పరశురామ్ తో కలిసి కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈమధ్యనే మహేష్ బాబు హీరోగా నటించిన “సర్కారు వారి పాట” సినిమా తో మర్చిపోలేని బ్లాక్బస్టర్ ని అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ పరశురాం తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పరశురాం ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమా చేయబోతున్నారని వినికిడి.

YouTube video