రాసేవి అన్నీ అసత్యాలే అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి తన పత్రిక (సాక్షి) దొంగ పత్రిక, అందులో రాసేవి అన్నీ అసత్యాలే అని అంగీకరించినందుకు ధన్యవాదాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. అలాగే సీఎం జగన్‌ ప్రతిపక్షంలోఉన్నప్పుడు బీసీలకు స్వయం ఉపాధి కల్పిస్తూ ఏర్పాటుచేసిన ఆదరణ పథకంలో అవినీతి, నాణ్యతలేని వస్తువులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. నాడు చేసిన తప్పుడు ప్రచారానికి కూడా సీఎం జగన్‌ బహిరంగ క్షమాపణ చెబితే బాగుంటుందని నారా లోకేష్‌ అన్నారు. టిడిపి పాలనలో బీసీలకు 36వేల కోట్లు కేటాయించి 28.8వేల కోట్లు ఖర్చు పెట్టారని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఒప్పుకుంది. ఆదరణ పథకం అద్బుతం అని ప్రకటించిందన్నారు. కాగా 23 జిల్లాలు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో బీసీల కోసం 3వేల కోట్లు కేటాయించిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గొప్పవారో, 13 జిల్లాలు ఉన్న నవ్యాంద్రప్రదేశ్‌లో 28.8వేల కోట్లు ఖర్చు పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు గారు గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవాలని ఆయన ట్వీట్‌ ద్వారా మనవి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/