మరోసారి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఎన్నిక

తుర్కయాంజాల్ లో సీపీఎం రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టడం ఆయనకు ఇది మూడోసారి. కాగా, 60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక కూడా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ లో ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభలు జరుగుతున్నాయి. కాగా రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్.వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ ల పేర్లు కూడా వినిపించాయి. అయితే, తమ్మినేనికే మరోసారి పార్టీ పగ్గాలు లభించాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/