రాధే శ్యామ్ లో టీం లో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిత్రం దగ్గరి నుండి పెద్ద చిత్రం వరకు అంత థమన్ పేరే చెపుతున్నారు. కనీసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన చాలని అంటున్నారు. ఈ తరుణంలో థమన్ కు పాన్ ఇండియా చిత్రానికి పనిచేసే అవకాశం లభించింది. ప్రభాస్ – పూజా హగ్దే కలయికలో రాధే శ్యామ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా … ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. జనవరి 14 న ఈ మూవీ పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీ గా ఉన్నారు.

ఇదిలా యూనిట్ తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం సెన్సెషనల్ మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌తో ఒప్పందం చేసుకున్నారట మేకర్స్‌. రాధేశ్యామ్‌ సినిమాకు దక్షిణాది భాషలకు తమన్‌ బీజీఎం అందిస్తాడని యూవీ క్రియేషన్స్‌ తెలిపింది. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు తమన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సినిమాలోని బీజీఎం హైలెట్‌గా నిలిచింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అఖండ బీజీఎం గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. అందుకే రాధే శ్యామ్ కు థమన్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది.

We are pleased to welcome the young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/S2T1r568IE— UV Creations (@UV_Creations) December 26, 2021