SS28 మూవీ నుండి థమన్ ను తప్పించారా..? అసలు క్లారిటీ ఇదే..

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న SS28 మూవీ నుండి థమన్ ను తప్పించారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చు అని ఫిక్స్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ వార్తల ఫై థమన్ స్పందించారు. ప్రస్తుతం తమన్ హావ ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ – తమన్ కలయికలో వచ్చిన అల వైకుంఠపురం లో , అరవింద సామెత చిత్రాల సాంగ్స్ మ్యూజికల్ గా పెద్ద విజయం సాధించాయి. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా..అది కూడా మహేష్ తో అనగానే అభిమానుల్లో , సంగీత ప్రియుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఈ క్రమంలో ఓ వార్త అందర్నీ షాక్ లో పడేసింది. ఈ చిత్రం నుంచి థమన్‌ని తప్పించారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. థమన్‌కి టాలీవుడ్‌లో కాపీ క్యాట్ అనే పేరు ఉంది.. ట్యూన్స్ ఇతర భాషల్లో నుంచి కాపీ కొట్టి మ్యాజిక్ చేస్తాడని ఇతనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. అయితే మహేష్ బాబు 28వ మూవీకి సంబంధించి ఇలాగే ఒక కాపీ ట్యూన్‌ కొట్టాడని.. అయితే అది మహేష్, త్రివిక్రమ్‌కి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్టు పుకార్లు వచ్చాయి. దీనికి హర్ట్ అయిన థమన్.. SSMB28 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు పలు వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు మేకర్స్. అయితే మహేష్ మూవీ నుంచి థమన్ తప్పుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని.. ఇవి ఒట్టి పుకార్లు మాత్రమేనని థమన్ కౌంటర్ ఇస్తూ.. ట్వీట్ చేసారు.