థాయ్‌ల్యాండ్‌లో ఆస్ట్రాజెన్‌కా టీకా పంపిణీ నిలిపివేత
vaccination
బ్యాంగ్‌కాక్: ఆస్ట్రాజెన్‌కా టీకా పంపిణీని థాయ్‌ల్యాండ్‌లో నిలిపివేశారు. ఆ టీకా తీసుకుంటే రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు రావడంతో.. ఆస్ట్రాజెన్‌కా టీకా పంపిణీ ఆపేశారు. అయితే ఆ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి ఇవాళ థాయ్‌ల్యాండ్ ప్రధాని తొలి డోసు టీకా తీసుకోవాల్సి ఉంది. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. డెన్మార్క్, నార్వే లాంటి దేశాలు కూడా ఆస్ట్రాజెన్‌కా టీకా వినియోగాన్ని నిలిపివేశాయి.
అయితే యూరోప్ దేశాల్లో సుమారు 50 లక్షల మంది ఇప్పటికే ఆస్ట్రాజెన్‌కా టీకా తీసుకున్నారు. అయితే సుమారు 30 కేసుల్లో థ్రాంబోఎంబోలిక్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. అంటే వారిలో రక్తం గడ్డకట్టే లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆస్ట్రాజెన్‌కా టీకా వల్లే రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పేర్కొన్నది.
తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/