మంత్రులను క్షేమపణలు కోరిన ఉద్దవ్‌ ఠాక్రే

మహారాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం ఉద్దవ్‌. మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం నేప‌థ్యంలో ముంబైలోని సెక్ర‌టేరియ‌ట్‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న వ‌ల్ల త‌ప్పేమైనా జ‌రిగి ఉంటే క్ష‌మించాల‌ని ఆయ‌న త‌న కేబినెట్ మంత్రుల‌ను కోరారు. అంతేకాకుండా త‌న‌కు ఇన్ని రోజులుగా మ‌ద్ద‌తుగా నిల‌బ‌డినందుకు ఆయ‌న మంత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

అలాగే రాష్ట్ర మంత్రివర్గం ఔరంగాబాద్​, ఒస్మానాబాద్ వంటి ప్రాంతాలకు పేర్లు మార్చాలన్న నిర్ణయాలకు తోడు.. మరికొన్ని కీలక పరిణామాలకు నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్‌ పేరును శంభాజీనగర్‌గా.. ఉస్మానాబాద్‌ పేరు ధారా శివ్‌గా మార్చింది. నవీముంబై ఎయిర్‌పోర్టు పేరును డీబీ పాటిల్‌ ఎయిర్‌పోర్టుగా మారుస్తూ ఉద్ధవ్‌ ఠాక్రే కేబినేట్‌ ఆమోదం తెలిపింది. ఈ రెండున్నరేళ్లుగా తనకు అండగా నిలబడిన, సహకరించిన వాళ్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. తన వాళ్లే తనను మోసం చేశారని, ఈ పరిస్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. సుప్రీంకోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. భేటీ అనంతరం మీడియాకు నమస్కరించి ఉద్దవ్‌ వెళ్లిపోయారు.