టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌ కోర్సులు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (నిడ్‌)లో బ్యాచిలర్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి డిజైన్‌ ఆప్టిట్యూట్‌ టెస్టు (డాట్‌) నిర్వహిస్తు న్నారు. నిడ్‌ ప్రధాన క్యాంపస్‌ అహ్మదాబా ద్‌లో ఉం ది. ఇక్కడ బిడి జైన్‌ కోర్సు నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ (విజయవాడ), హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌ల్లో నాలుగేళ్ల వ్యవధితో గ్రాడుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ డిజైన్‌ (జిడిపిడి) కోర్సు అందిస్తున్నారు.

Textile Designing Courses

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఇంటర్‌ పూర్తిచేసిన వారు. ద్వితీయ సంవత్సర విద్యార్ధులు అర్హులు. ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరాల్లో దుస్తులు ఒకటి. ఒక్కొక్కరూ ఒక్కో తరహా అవసరా లను పరిగణనలోకి తీసుకుని టెక్స్‌టైల్‌డిజైనర్లు వస్త్రాలను రూపొందిస్తారు. సౌకర్యవంతంగా ఉంటూనే, ఆకర్షణీయంగా ఉండేలా వస్త్రాన్ని తీర్చిదిద్దుతారు.

వీరికి టెక్స్‌టైల్‌ పరిశ్ర యలు, రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలు, రిటైల్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. డిజైన్‌ కోర్సుల్లో వివిధ స్పెష లైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని బ్యాచి లర్‌ స్థాయిలోనే చదువుకోవచ్చు. పలు సంస్థల్లో మొది ఏడాది సిలబస్‌ ఉమ్మడిగా ఉంటుంది. ప్రథమ సంవత్సరం కోర్సులో చూపిన ప్రతిభ, ఆసక్తికి అనుగుణంగా రెండో ఏడాది నుంచి నచ్చిన స్పెషలైజేషన్‌లో చదువుకోవచ్చు.

Textile Designing Courses (File)

యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌, ఎగ్జ్‌బిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌ మొదలైన కోర్సులను ఎన్నో సంస్థలు డిగ్రా, పిజి, పిహెచ్‌డి స్థాయిల్లో అందిస్తున్నాయి. పిజి తర్వాత పిహెచ్‌డి చేసినవారు డిజైన్‌ సంస్థల్లో బోధకులుగా, పరిశోధకులుగా రాణించవచ్చు.

పాదరక్షలు, బెల్టులు, బ్యాగులు వీటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఈ విభాగాల్లో దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి సంస్థలెన్నో ఉత్పత్తులను రూపొందిస్తున్నాయి. సోఫాలతోపాటు వివిధ వస్తువుల తయారీలో లెదర్‌ వినియోగం పెరిగింది.

జంతువుల తోలుతో ఆకర్షణీయమైన వస్తువులను రూపొందించడంల లెదర్‌ డిజైనర్ల విధి. వీరికి ఎక్కువగా అపారెల్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. నిడ్‌ నిఫ్ట్‌లతోపాటు పుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఈ స్పెలైజేషన్‌ అందుబాటులో ఉంది.

వీరు ఫిల్మ్‌ టెలివిజన్‌, అడ్వర్టైజింగ్‌ పరిశ్రల్లో ప్రొడ్యుసర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్‌, ఎడిటర్లుగా పనిచేయవచ్చు. ప్రస్తుతం ఎక్కువమంది వీడియో ఫిల్మ్‌ డిజైనర్లు ఆన్‌లైన్‌ మీడియాలో పనిచేస్తున్నారు. సొంతంగానూ వీడియో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు.

వివాహాలే కాకుండా పుట్టినరోజు, గృహప్రవేశాలు, ఇలా ప్రతి సందర్భంలోనూ వీడియో షూట్‌ తప్పనిసరిగా మారింది. కాబట్టి నైపుణ్యం ఉన్నవారు సొంతంగానే చేతినిండా పని పొందవచ్చు. శ్రేష్ట ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, పెర్ట్‌ అకాడెమీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, సింబ యాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, విట్‌ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, రాంచీ యూనివర్సిటీ, అమిటీ యూని వర్సిటీ, ఢిల్లీ, యూనివర్సిటీ, గాల్గోటియా యూనివర్సిటీ.

ఇండస్ట్రియల్‌ డిజైన్‌:

ఇండస్ట్రియల్‌ డిజైన్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు తయారీ సంస్థల్లో వస్తువు, ఉత్పత్తిని డిజైన్‌ చేస్తారు. ఫర్నిచర్‌, ఇంటీరియర్‌, ఇంజినీరింగ్‌ ప్రొడక్ట్స్‌, సిస్టమ్‌ కన్జూమర్‌ గూడ్స్‌, క్రాఫ్ట్‌ బేస్డ్‌ప్రొడక్ట్స్‌,యాక్సెరీస్‌, పర్సనల్‌ యూజర్‌ ప్రొడక్ట్స్‌, కిచెన్‌ టూల్స్‌ అండ్‌ ఆప్లయన్సెస్‌, కొత్త తరం ఎల్రక్టానిక్స్‌, ఐటి తదితర సంస్థల్లో పనిచేయవచ్చు. ఇండస్ట్రీయల్‌ డిజైన్‌లో ప్రొడక్ట్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/