హ్యాకర్లకు టెస్లా సంస్థ బంపర్‌ ఆఫర్‌

హ్యాక్‌ చేస్తే కారుతోపాటు మిలియన్‌ డాలర్ల రివార్డు

Tesla car
Tesla car

శాన్ ఫ్రాన్సిస్కొ: ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా హ్యాకర్లకు అద్భుతమైన ఆఫర్‌ను ముందుంచింది. టెస్లా సరికొత్త హ్యాకింగ్ పోటీతో ముందుకు వచ్చింది. తమ సంస్థ నుంచి వచ్చిన మోడల్ 3 కార్లను హ్యాక్ చేసి చూపాలని సవాల్ విసరడం గమనార్హం. అలా హ్యాక్ చేసి చూపిస్తే భారీ మొత్తం రివార్డుగా ఇస్తామని తెలిపింది. ఓ మోడల్ 3 కారుతో పాటు ఒక మిలియన్ డాలర్ల నగదు బహుమతిగా ఇస్తామని తెలిపింది. ప్రతి సంవత్సరం కెనడా తీర ప్రాంత పట్టణం వ్యాంకోవర్‌లో జరిగే వార్షిక కార్యక్రమంలో ఈ పోటీ జరగనుంది. గత ఏడాది మార్చిలో జరిగిన ఇదే తరహా పోటీలో మోడల్ త్రీ కారులోని ఇన్ఫోటైన్మంట్ వ్యవస్థలోకి ప్రవేశించి కొంతమంది హ్యాకర్లు లోపాన్ని ఎత్తిచూపారు. దీంతో మోడల్ ఎస్ కారులోకి ప్రవేశించి దారి ఎలా మళ్లించవచ్చునో అడ్వర్షియల్ అటాక్ పద్ధతి ద్వారా చూపించారు. దీంతో హ్యాకర్లకు 35 వేల డాలర్లను, ఓ కారును బహూకరించారు. ఇలాంటి రివార్డ్ వల్ల భద్రతాపరమైన లోపాలు వెలుగు చూస్తాయని టెస్లా అభిప్రాయపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/