జమ్మూకశ్మీర్‌లో మ‌రోసారి ఉగ్రవాదుల కాల్పులు

శ్రీనగర్‌ : జ‌మ్మూకాశ్మీర్ లో మ‌రోసారి ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. ఈరోజు ఉదయం శ్రీనగర్‌లోని ఐవా బ్రిడ్జి వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఒక‌రి ప‌రిస్థితి ఆందోళ‌క‌రంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. “శ‌నివారం ఉదయం 8:40 గంటలకు, శ్రీన‌గ‌ర్ లోని సఫకదల్ ప్రాంతంలోని ఐవా బ్రిడ్జి సమీపంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలీసుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్ గులాం హసన్‌పై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచార‌ని ఓ పోలీసు ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. ఈ విష‌యం తెలుసుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వెంట‌నే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. దాడుల‌కు పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల కోసం వెతుకులాట ప్రారంభించామని అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/