శ్రీలంక పేలుళ్లు..ఉగ్రసంస్థ వద్ద నగదు స్వాధీనం

terrorist attacks in srilanka
terrorist attacks in srilanka

terr హైదరాబాద్‌: శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లకు నేషనల్‌ తౌహిద్‌ జమాత్‌ సంస్థ ఉగ్రవాదులే కారణమని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఐతే ఆ గ్రూపు వద్ద సుమారు 14 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. ఇంకా ఆ సంస్థ వద్ద సుమారు 700 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా. నగదులో సగం సిఐడి స్వాధీనం చేసుకున్నారు. మిగతా సగం బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్నట్లు గుర్తించారు. ఐతే ఆ అకౌంట్లను రద్దు చేయనున్నారు. ఇప్పటివరకు వరుస పేలుళ్లకు సంబంధించి 74 మంది అనుమానితులను అరెస్టు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/