కాబూల్‌ విశ్వవిద్యాలయం వద్ద ఉగ్రదాడి, పేలుడు

Gunshots fired inside Kabul University

కాబూల్‌: కాబూల్ విశ్వవిద్యాలయం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాద దాడిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో యూనివర్శిటీ ప్రాంగణం దద్దరిల్లింది. కాబూల్ యూనివర్శిటీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, దాడి చేసిన వారి గురించి ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం లేదు. దాడి చేసిన వారు ఎంత మంది అనేది కూడా స్పష్టంగా లేదు. ప్రాణనష్టం ఎంత జరిగింది అనేది కూడా ఇంకా తెలియరాలేదు. భద్రతా దళాలు యూనివర్శిటీ ప్రాంగణాన్ని చుట్టుముట్టాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/