అయ్యన్న పాత్రుడి ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం

ఏపీలో అయ్యన్న VS వైసీపీ వార్ నడుస్తుంది. మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ సంస్మరణ సభలో అయ్యన్నపాత్రుడు చెత్త పాలన చేసే చెత్త నా … అని జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సహా పలువురు నేతలు శుక్రవారం చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వైసీపీ జెండాలు, కర్రలతో చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన వైసీపీ నేతలు చంద్రబాబుకు, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో పాటు తోపులాటకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేయడానికి లాఠీఛార్జి చేశారు.

ఇదిలా ఉంటె ఈరోజు అయ్యన్నపాత్రుడి ఇంటి ముట్టడికి వైసీపీ నేతలు యత్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఏంజరుగుతుందో అనే టెన్షన్ నెలకొని ఉంది.