రెండో రోజు కూడా ఇంటర్‌బోర్డు వద్ద ఉద్రిక్తత

inter board
inter board


హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్రరూపం దాల్చుతుంది. వరుసగా రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. నవ్య అనే విద్యార్ధినికి 99 కి బదులు 0 వేసిన ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని బోర్డు కార్యదర్శి అశోక్‌ చెప్పారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం ఇంటర్‌బోర్డులో అధికారుల మధ్య విభేదాలే కారణమని ఇంటిలిజెన్స్‌ వర్గాలు సియంకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. బోర్డులోని కొందరు అధికారుల మధ్య అంతర్గత తగాదాల వల్ల కొందరు ఈ అపోహలు సృష్టించారని విద్యాశాఖ మంత్రి ఆదివారమే వ్యాఖ్యానించడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/