జగన్‌ నివాసం ముందు తొక్కిసలాట

ప్రజా దర్బార్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభం

tension at jagan's house
tension at jagan’s house

అమరావతి: తాడేపల్లిలో ఏపి సియం జగన్‌ ఇంటి ముందు తొక్కిసలాట జరిగింది. సియం ఫిర్యాదలు తీసుకుంటారనే ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరూ ఒక్కసారిగా రావడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సియంను కలవాలంటూ ఒక్కసారిగా ప్రజలు లోపలికి రావడంతో తోపులాట జరిగింది.
కాగా సియం జగన్‌ నేటి నుంచి ప్రారంభించాలనుకున్న ప్రజా దర్బార్‌ ఒకటోతేదీకి వాయిదా పడింది. ఐతే ఆ విషయం తెలియని ప్రజలు సియం నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చివరికి విషయం తెలుసుకుని నిరాశతో వెనుదిరిగారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/