గల్లా జయదేవ్‌ నివాసం వద్ద ఉద్రిక్తత

టిడిపి లో ఉంటే అరెస్టులు చేసేస్తారా?

galla-jayadev-house
galla-jayadev-house

గుంటూరు: గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైవేల దిగ్బంధానికి బయలుదేరేందుకు గల్లా జయదేవ్‌ యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని ఇంటిగేట్‌ను తాళ్లతో కట్టేశారు. దీంతో గల్లా జయదేవ్ సహా టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం
చేస్తున్నారు. మరోవైపు హైవేల దిగ్బంధానాకి వెళ్లనీయకుండా పలువురు టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా తనను గృహ నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులపై గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపి లో ఉంటే అరెస్టులు చేసేస్తారా? అని విరుచుకుపడ్డారు. పోలీసులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను బయటకు వెళ్తానని, ఏం చేస్తారో చేసుకోవాలని సవాలు విసిరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/