చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్ ను, అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని దూషించిన నేపద్యంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆద్వర్యంలో నిరసన చేపట్టడంతో ఈ ఉద్రిక్తత ఏర్పడింది.

అయ్యన్న వ్యాఖ్యలపై చద్రబాబు క్షమాపణ చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆద్వర్యంలో టిడిపికి చెందినవారు కూడా గుమికూడడంతో రెండు వర్గాల మద్య తోపులాట జరిగినట్లు సమాచారం. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సర్దుబాటు చేయడానికి యత్నించారు. ప్రస్తుతం అక్కడ ఏంజరుగుతుందో అనే టెన్షన్ లో ఇరు కార్యకర్తలు ఉన్నారు.