మావోయిస్టుల ఘాతుకం 16 మంది పోలీసులు మృతి

IED blast by Maoists in Gadchiroli
IED blast by Maoists in Gadchiroli

గడ్చిరోలి: మహరాష్ట్రలోని గడ్చిరోలిలో ఈరోజు మధ్యాహ్నం ఓ పోలీస్‌ వాహనంపై మావోయిస్టులు ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 16 మంది పోలీసలు మృతి చెందినట్లు సమాచారం. అయితే గడ్చిరోలిలో భద్రతాసిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్‌ ఐఈడీ పేల్చారు.ఘటన సమయంలో వాహనంలో 16 మంది సిబ్బంది ఉన్నారు. పేలుడు అనంతరం నక్సల్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలియాల్సి ఉంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/